ఆయుధం వీడిన మల్లోజుల.. ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం | Mallojula Venugopal Surrenders At Maharashtra Police With 60 Others, CM Offers Six Crore Reward | Sakshi
Sakshi News home page

ఆయుధం వీడిన మల్లోజుల.. ఆరు కోట్ల రివార్డు అందించిన సీఎం

Oct 15 2025 11:10 AM | Updated on Oct 15 2025 12:16 PM

Mallojula Venugopal Surrender At Maharashtra Police

ముంబై: మావోయిస్టు పార్టీ  అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ (Mallojula Venugopal) అలియాస్‌ అభయ్‌ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల మంగళవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్‌(Devendra Fadnavis) సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలు సరెండర్‌ చేశారు.

బుధవారం ఉదయం మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు(maoists) ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. ఇక, మల్లోజులపై దాదారు ఆరు కోట్ల రివార్డు ఉండటంతో(ఆరు రాష్ట్రాల్లో కోటి చొప్పున) ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌.. రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ..‘మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో మావోయిజానికి చోటులేదు. నక్సల్‌ ఫ్రీ భారత్‌ నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చారు. 
 

అయితే, మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement