విదేశాల నుంచి వీరాపురానికి.. | - | Sakshi
Sakshi News home page

విదేశాల నుంచి వీరాపురానికి..

Feb 17 2026 7:20 AM | Updated on Feb 17 2026 7:20 AM

విదేశ

విదేశాల నుంచి వీరాపురానికి..

ఆడబిడ్డ నిధి ఎప్పుడు బాబూ..?

రెండేళ్లుగా ఆడబిడ్డ నిధి కోసం మహిళలందరమూ ఎదురు చూస్తున్నాం. నెలకు రూ.1,500 చొప్పున కుటుంబంలో ఎంత మంది 18 ఏళ్లు నిండిన మహిళలు ఉంటే అందరికీ ఇస్తామన్నారు. కానీ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు. ఈ బడ్జెట్‌లో కూడా ఈ పథకం గురించి ఎలాంటి ఊసే లేదు. రెండేళ్లకు గాను రూ.36వేలు బకాయిలు పేరుకుపోయాయి. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి రూ.18,750లు వస్తుండేది. ఇది కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉండేది.

– రమాదేవి, గృహిణి, పత్యాపురం, బత్తలపల్లి మండలం

మోసపూరిత బడ్జెట్‌

చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పూర్తి మోసపూరితంగా ఉంది. సంక్షేమ పథకాలకు, కేటాయించిన బడ్జెట్‌కు పొంతన లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా... 50 ఏళ్లకే బీసీల పింఛన్‌ పథకం అమలుపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.11వేల కోట్లు నిధులు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.6,600 కోట్లు ప్రకటించి రైతులకు తీరని ద్రోహం చేశారు. ఇది కూడా పాత బడ్జెట్‌లోని కేటాయింపే. కొత్తగా కేటాయించింది ఏమీ లేదు. ఆడ బిడ్డ నిధి పథకం ఊసే లేదు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను వంచనకు గురి చేసింది.

– పొగాకు రామచంద్ర, వైఎస్సార్‌సీపీ వాల్మీకి సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు, పెనుకొండ

ఆటో బోల్తా..

పలువురికి తీవ్రగాయాలు

హిందూపురం: స్థానిక పట్టణ శివారున శ్రీకంఠపురం చెరువు సమీపంలో సోమవారం ఆటో బోల్తాపడిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన రవి, నాగరాజు కుటుంబసభ్యులు సోమవారం లేపాక్షిలో జరిగిన రథోత్సవంలో పాల్గొని ఆటోలో హిందూపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీకంఠపురం చెరువు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో డ్రైవర్‌ తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ గాయపడ్డారు. మేళాపురానికి చెందిన గోవిందప్ప తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం నివాసి రవి తల, ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. రెండేళ్ల చిన్నారి యజ్ఞేష్‌కు ఎడమ కాలు విరిగింది. పూజిత, లక్ష్మీదేవి, వర్షితకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో గోవిందప్పను బెంగళూరుకు రెఫర్‌ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మహిళ ఆత్మహత్య

ధర్మవరం అర్బన్‌: స్థానిక గాండ్లవీధిలో నివాసముంటున్న రామాంజనమ్మ(60) ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గంగాధర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి తన ఇంట్లోనే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ణ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

సాక్షి, పుట్టపర్తి: ఏటా ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం మొదలవుతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ అక్కడి పక్షులు జనవరి చివరి వారంలో వీరాపురానికి వస్తాయి. ఇక్కడే సంతానోత్పత్తి పూర్తి చేసుకుని ఆగస్టు తరువాత తిరిగి పిల్లలతో సహా వెళ్లిపోతాయి. వీరాపురంలో 188 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పురాతన చెరువు వీటికి ఆవాసంగా మారింది. ఈ చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. చుట్టూ వందలాది చెట్లు ఉండటంతో ఎన్నో ఏళ్లుగా సైబీరియా నుంచి వేల సంఖ్యలో కొంగ జాతి పక్షులు వలస వస్తున్నాయి. వీటిని స్థానికులు ప్రేమగా ఎర్రమూతి కొంగలంటారు. కాలానికి అనుగుణంగా చెరువులోని చేపలతో పాటు ఆహారం కోసం చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. కొన్నేళ్లుగా గ్రామంతో ఇవి మమేకమయ్యాయి. సీజన్‌లో పక్షులను చూసేందుకు వచ్చే పర్యాటకులతో వీరాపురం కిటకిటలాడుతుంది.

పెయింటెడ్‌ స్టార్క్‌ల జీవన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీళ్లు గొంతు వరకు నింపుకుని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీటిని బయటకు తీసి ఇవ్వడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆహారం కోసం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువులు, పంట పొలాల వైపు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి.

గ్రామంలోని ఇళ్ల మధ్య చెట్లపైనే సుమారు రెండు వేలకు పైగా సైబీరియరిన్‌ కొంగలు కనిపిస్తుంటాయి. 24 గంటలూ వాటి అరుపులతో ఎవరికై నా చిరాకు పుట్టడం సహజం. అయితే వీరాపురం గ్రామస్తులు మాత్రం వాటి అరుపులను ఆస్వాదిస్తూ బంధువుల్లా ఆదరిస్తారు. అంతేకాకుండా చెరువును వారసత్వ సంపదగా ప్రకటించారు. ఈ చెరువు నీటితో పంటు సాగుచేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరించి పక్షులు రాకుండా పోతాయనే భయంతో గ్రామానికి చెందిన రైతులు ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు శాశ్వతంగా విరామం ప్రకటించారు. బోరు బావులు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు.

సైబీరియన్‌ కొంగల రాకతో గ్రామానికి మేలు జరుగుతుందని వీరాపురం వాసుల నమ్మకం. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు.

గ్రామంలోని చెట్ల మీద సేద

తీరుతున్న పక్షులు

వీరాపురం.. చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున ఉన్న ఓ మారుమూల గ్రామం. విదేశీ జాతికి చెందిన పక్షులు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ గ్రామానికి వస్తుండడంతో వీరాపురం పేరు గూగుల్‌లోకి ఎక్కింది. మూడు శతాబ్దాలుగా విదేశీ పక్షులతో ఆ గ్రామానికి అనుబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సైబీరియా, రష్యా దేశాల నుంచి ఖండాంతరాలు దాటి శీతాకాలంలో పక్షులు వలస వస్తుండడం విశేషం.

చూడముచ్చటైన పక్షులు..

అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్‌ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతం. రష్యాలోని సైబీరియా లోయ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 150 రకాల జాతుల పక్షులు ఉన్నాయి. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో అక్కడి పక్షులు వలస బాట పడుతుంటాయి. శ్రీలంక, థాయ్‌లాండ్‌, ఇండియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు వలస వెళుతుంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్నెళ్ల పాటు సేదతీరుతూ సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సైబీరియాకు పయనం అవుతాయి. పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. వీటి శాసీ్త్రయ నామం ‘మిక్టీరియాలూకోసిఫల’. 3 నుంచి 3.5 అడుగుల ఎత్తు ఉంటాయి. ఎగరడానికి రెక్కలు విప్పితే ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. సుమారు 3.5 నుంచి 4 కిలోల వరకు బరువు ఉంటుంది.

ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో సైబీరియా నుంచి వస్తున్న పక్షులు

ఆరు నెలల తర్వాత స్వదేశానికి

తిరుగు పయనం

మూడు శతాబ్దాలుగా గ్రామంతో

పక్షులకు విడదీయరాని అనుబంధం

మేలు

జరుగుతుందనే నమ్మకం..

బంధువుల్లా ఆదరిస్తూ..

జీవనశైలి ప్రత్యేకం..

వీరాపురం చేరుకోండి ఇలా..

చిలమత్తూరు నుంచి 11 కిలోమీటర్ల దూరం, హిందూపురం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వీరాపురం ఉంది. రైలులో అయితే హిందూపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆ గ్రామానికి వెళ్లవచ్చు. బెంగళూరు – హైదరాబాద్‌ జాతీయ రహదారి మీదుగా కొడికొండ చెక్‌ పోస్టు చేరుకుని.. అక్కడి నుంచి చిలమత్తూరు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు.

విదేశాల నుంచి వీరాపురానికి.. 1
1/7

విదేశాల నుంచి వీరాపురానికి..

విదేశాల నుంచి వీరాపురానికి.. 2
2/7

విదేశాల నుంచి వీరాపురానికి..

విదేశాల నుంచి వీరాపురానికి.. 3
3/7

విదేశాల నుంచి వీరాపురానికి..

విదేశాల నుంచి వీరాపురానికి.. 4
4/7

విదేశాల నుంచి వీరాపురానికి..

విదేశాల నుంచి వీరాపురానికి.. 5
5/7

విదేశాల నుంచి వీరాపురానికి..

విదేశాల నుంచి వీరాపురానికి.. 6
6/7

విదేశాల నుంచి వీరాపురానికి..

విదేశాల నుంచి వీరాపురానికి.. 7
7/7

విదేశాల నుంచి వీరాపురానికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement