హరహర మహాదేవ
న్యూస్‌రీల్
తప్పుల తడకగా డ్యాష్ బోర్డు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు, చేతలకు ఏ మాత్రమూ సంబంధం ఉండదని మరోసారి రుజువైంది.
జిల్లా అంతటా ఆదివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి వాతావరణం కొనసాగింది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
జిల్లావ్యాప్తంగా ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ‘హరహర మహాదేవ శంభో శంకర’ నామస్మరణ మార్మోగింది. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పలుచోట్ల పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. తాడిమర్రి మండలంలోని కాటికోటేశ్వర క్షేత్రంలో పరమశివుడిని భక్తులు మనసారా ఆరాధించుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలోని ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం వద్ద అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఆలయంలో జరిగిన శివపార్వతుల కల్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొని స్వామి,అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. ఎన్‌పీ కుంట మండలంలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి
సందర్భంగా సందడి నెలకొంది. పర్వదిన ప్రాముఖ్యతను పండితులు
వివరించారు. భక్తులు రాత్రంతా జాగారం చేసి పరమ శివుని సేవలో తరించారు. ఆలయాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను
మంత్రముగ్ధులను చేశాయి. – సాక్షి బృందం
హరహర మహాదేవ
హరహర మహాదేవ
హరహర మహాదేవ
హరహర మహాదేవ


