కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

కోర్ట

కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు

అనంతపురం: అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19న ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం ఎంపిక పరీక్ష వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతపురం రుద్రంపేట పరిధిలోని శ్రీ బాలాజీ పీజీ కాలేజ్‌, పీవీకేకే ఇంజినీరింగ్‌ కాలేజీలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ ఉద్యోగం ఎంపిక పరీక్ష మధ్యాహ్నం 12: 30కు ప్రారంభమవుతుందని, 90 నిమిషాల వ్యవధి ఉంటుందన్నారు. రికార్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఎంపిక పరీక్ష మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు జరగాల్సిన పరీక్ష హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల వివరాలు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు.

ఎంపీపీపై అవిశ్వాసం

పుట్టపర్తి అర్బన్‌: మండల అభివృద్ధిని విస్మరించడంతో పాటు కనీసం మండల సర్వసభ్య సమవేశాలు కూడా నిర్వహించని ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిపై ఎంపీటీసీ సభ్యులు తిరుగుబాటు చేశారు. ఎంపీపీగా ఉండే అర్హత ఆయనకు లేదంటూ అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మాన ప్రతిని సోమవారం పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు అందజేశారు. మండలంలో ఎంపీపీతో పాటు 8 మంది ఎంపీటీసీ సభ్యులుండగా ఎంపీపీకి వ్యతిరేకంగా ఏడుగురు ఎంపీటీసీలు సంతకాలు చేశారు. వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీపీ పదవి నుంచి ప్రసాద్‌రెడ్డిని తొలగించాలన్నారు.

భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

పరిశీలించిన ఎస్పీ

అమరాపురం: హేమావతి సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించే అగ్నిగుండ ఉత్సవానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన సిద్ధ్దేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం సీఐ రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ వలిబాషా, సిబ్బందితో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్‌ కరేగౌడతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, ప్రసాద కౌంటర్లు, అన్న ప్రసాద పంపిణీ తదితర వాటిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

కోర్టు ఉద్యోగాలకు  19న ఎంపిక పరీక్షలు 1
1/2

కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు

కోర్టు ఉద్యోగాలకు  19న ఎంపిక పరీక్షలు 2
2/2

కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement