ఆర్.మరువపల్లిలో దాహం కేకలు
రొద్దం: వేసవి సమీపించక ముందే మండలంలోని ఆర్.మరువపల్లిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని రక్షిత మంచినీటి పథకానికి నీరు సరఫరా చేసే బోరు వారం రోజుల క్రితం చెడిపోయింది. దీంతో తాగునీరు సరఫరా కాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తాగునీటి కోసం కొందరు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు డబ్బులు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టుకుంటున్నారు. అధికారులను గట్టిగా నిలదీస్తే నిధులు లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. దీంతో పనులు సైతం వదులుకుని తాగునీటి ట్యాంకర్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
మరమ్మతులకు గురైన
రక్షిత మంచినీటి పథకం బోరు
ట్యాంకర్ల
ద్వారా
నీరు కొనుగోలు చేస్తున్న
ప్రజలు


