సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

సేవాల

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

గుత్తి రూరల్‌: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 287వ జయంత్యుత్సవాలు శుక్రవారం గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు మాతా జగదాంబ ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ చేశారు. సేవాలాల్‌ ఆలయ ముఖద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం వైద్యశిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌, మరుగుదొడ్లు, వసతి ఏర్పాట్లతో పాటు ద్విచక్రవాహనాలు, జీపులు, కార్ల పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

మాతా జగదాంబ ఆలయంలో హోమం..

సేవాగఢ్‌లోని మాతా జగదాంబ ఆలయ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మారుతీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, అభిషేకం తదితర పూజలు చేశారు.

భారీ బందోబస్తు..

సేవాలాల్‌ జయంత్యుత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రామారావు తెలిపారు.

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం 1
1/1

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement