మార్కెట్‌కు 497 క్వింటాళ్ల చింతపండు
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్‌కు చింతపండు భారీగా తరలివచ్చింది. శుక్రవారం నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి 497.10 క్వింటాళ్ల చింత పండు మార్కెట్‌కు వచ్చింది. ఇందులో ప్లవర్ రకం చింతపండు 224 లాట్లకు గానూ 276.00 క్వింటాళ్లు, కరిపుల్లి రకం 213 లాట్లకు గానూ 221.10 క్వింటాళ్లు వచ్చింది. మొత్తంగా 1659 బస్తాలు చింతపండు మార్కెట్‌కు రావడంతో ట్రేడ్ విలువ దాదాపు ప్లవర్ క్వింటా గరిష్టంగా సుమారు రూ.12 వేలు ధరక పలకగా, కరిపుల్లి గరిష్టంగా రూ.17,500 వరకు ధరలు పలికాయి. మొత్తంగా ట్రేడ్ విలువ సుమారు రూ. 5.56 కోట్లు ధరలు పలికాయి.


