ఎట్టకేలకు దిగొచ్చిన ఇన్‌టెక్‌ యాజమాన్యం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు దిగొచ్చిన ఇన్‌టెక్‌ యాజమాన్యం

Feb 15 2026 12:35 PM | Updated on Feb 15 2026 12:35 PM

ఎట్టకేలకు దిగొచ్చిన ఇన్‌టెక్‌ యాజమాన్యం

ఎట్టకేలకు దిగొచ్చిన ఇన్‌టెక్‌ యాజమాన్యం

చిలమత్తూరు: మండల పరిధిలోని ముద్దప్పపల్లి వద్ద ఉన్న వేద ఇన్‌టెక్‌ ఇండియా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు రమేష్‌ గురువారం పాపిరెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. పరిహారం కోసం మృతుడి బంధువులతో కలిసి వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు రెండు రోజులుగా జరిపిన పోరాటంతో ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం దిగొచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో బాధిత కుటుంబం ఆందోళన విరమించింది. సీపీఎం జిల్లా కమిటీ నేత ప్రవీణ్‌కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పరిశ్రమల్లో కార్మికులకు భద్రత లేదని, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రెండో రోజు ఆందోళన సందర్భంగా పరిశ్రమ ఎదుట రమేష్‌ చిత్రపటం ఉంచి పిండప్రదానం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ నాయకుడు రమేష్‌, సీపీఎం నాయకులు రామచంద్ర, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement