జలవనరుల సంరక్షణకు చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

జలవనరుల సంరక్షణకు చర్యలు తీసుకోండి

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

జలవనర

జలవనరుల సంరక్షణకు చర్యలు తీసుకోండి

ప్రశాంతి నిలయం: జలవనరుల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చెరువులు, వాగులు, వంకల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నీటి వనరుల సంరక్షణపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అధికారులతో పాటు ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పలువురు వర్చవల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... చెరువులు, వంకలను ఆక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మవరం, కొట్నూరు, పరిగి, ఓడీ చెరువు తదితర ప్రాంతాల్లోని చెరువులను ఆక్రమించిన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణ దారులకు ముందు నోటీసులు అందజేసి తొలగింపులు చేపట్టాలన్నారు. పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది ఆక్రమణలపై కోర్టు కేసులను పరిశీలించాలన్నారు. చెరువులో ఎవరైనా మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌ సరిహద్దులను స్పష్టంగా గుర్తించి మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

అధికారులకు జేసీ ఆదేశం

జలవనరుల సంరక్షణకు చర్యలు తీసుకోండి 1
1/1

జలవనరుల సంరక్షణకు చర్యలు తీసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement