కుటుంబ సభ్యులతోనే...
మల్బరీ సాగుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగబడులు సాధిస్తున్నాం. 300 గుడ్లకు దాదాపు రూ.15 వేల వరకు ఖర్చులు వస్తాయి. దిగుబడి బాగుంటే రూ.1.50 లక్షల వరకు నికర ఆదాయం ఉంటుంది. కూలీలతో పెద్దగా అవసరం ఉండదు. నా వరకు కుటుంబ సభ్యులతోనే మల్బరీ సాగు చేస్తున్నా. గూళ్లు విడిపించే సమయంలో మాత్రమే కూలీలను పనిలోకి తీసుకుంటున్నా. – రాము, రైతు
గ్రామం మొత్తం మల్బరీ సాగు
మా ఊళ్లో మొత్తం 120 కుటుంబాలు ఉంటే 110 కుటుంబాలు పట్టు పురుగుల పెంపకంతోనే జీవనం సాగిస్తున్నాయి. గ్రామం మొత్తం ఎటు చూసినా మల్బరీ తోటలే కనిపిస్తాయి. మల్బరీ సాగుతో మా కష్టాలు తీరాయి.
– రాజన్న, రైతు
కుటుంబ సభ్యులతోనే...


