పెట్రోల్‌ పోసి యువకుడి హత్య | Young man was assassinated in Hindupur town of Sri Sathya Sai district | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసి యువకుడి హత్య

Feb 8 2026 3:54 AM | Updated on Feb 8 2026 3:54 AM

Young man was assassinated in Hindupur town of Sri Sathya Sai district

మద్యం మత్తులో గొడవపడ్డ యువకులు 

హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద సుహేబ్‌(25) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నింకంపల్లి సమీపంలోని పాడుబడిన బావి నుంచి దుర్వాసన రావడంతో శనివారం సమీప ప్రాంతాల వారు వెళ్లి చూశారు. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించి టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి విచారణ చేపట్టారు. 

హతుడు హిందూపురం పట్టణం సమీపంలోని హస్నాబాద్‌కు చెందిన సుహేబ్‌గా గుర్తించి..తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రెండు, మూడు రోజుల కిందట కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడి సుహేబ్‌ను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు భావిస్తున్నారు. టూటౌన్‌ పోలీసులు అనుమానితులైన యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement