ఓం నమః శివాయ
‘ఓం నమః శివాయ’ పంచాక్షరీ మంత్రంతో జిల్లా ప్రతిధ్వనిస్తోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ఇప్పటికే ఆలయాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం జాగరణకు, శివపార్వతుల కల్యాణ మహోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం, తిమ్మమ్మమర్రిమాను వద్ద వెలసిన తిమ్మమాంబ ఆలయం, బత్తలపల్లి మండలంలోని సంఘమేశ్వర క్షేత్రం, సంజీవపురం సమీపంలోని కాటికోటేశ్వరాలయం , అమరాపురం మండలం హేమావతిలో ఓంకారేశ్వరుడు మానవాకారుడిగా వెలసిన క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఓం నమః శివాయ


