మామిడి తోటలో షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

మామిడి తోటలో షార్ట్‌ సర్క్యూట్‌

Feb 15 2026 12:35 PM | Updated on Feb 15 2026 12:35 PM

మామిడి తోటలో షార్ట్‌ సర్క్యూట్‌

మామిడి తోటలో షార్ట్‌ సర్క్యూట్‌

తాడిమర్రి: మండలంలోని దాడితోట గ్రామంలో రైతు దిద్దేకుంట రామచంద్రారెడ్డి పొలంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. అగ్ని ప్రమాదంలో ల్యాటరల్‌ పైపులతో పాటు పూతకు వచ్చిన మామిడి చెట్లు కాలిపోయాయి. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. దిద్దేకుంట రామచంద్రారెడ్డికి చెందిన సర్వే నంబర్‌ 213లోని రెండు ఎకరాల పొలంలో ఐదేళ్ల క్రితం 220 మామిడి మొక్కలు నాటాడు. ప్రస్తుతం తోట పూత, పిందెలతో కళకళలాడుతోంది. శనివారం ఉదయం రైతు చెట్లకు నీరు పెట్టడానికి వెళ్లగా ల్యాటరల్‌ పైపులతో పాటు 220 మామిడి చెట్లలో పూత, పిందెలు కాలిపోయి వాడుపట్టిన దశలో కనిపించాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో ఇలా జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల తోటలో గడ్డి నివారణ కోసం మందు పిచికారీ చేశానని, గడ్డి ఎండిపోవడంతో మంటలు త్వరగా చెట్లకు వ్యాపించాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.2.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న మొక్కలు కాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందన్నాడు. పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు.

రూ.2.50 లక్షల నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement