అట్టహాసంగా దామోదరం సంజీవయ్య విగ్రహావిష్కరణ
మడకశిర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం మాల మహానాడు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని అమరాపురం–హిందూపురం ప్రధాన రోడ్డులో విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్, రేంజర్ల రాజేష్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మాజీ మంత్రులు హెచ్‌బీ నర్సేగౌడ్, రఘువీరారెడ్డి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, రాష్ట్ర, జిల్లా స్థాయి మాల మహానాడు నాయకులు కార్యక్రమంలో పాల్గొ న్నారు. తొలుత పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకు మునుపు మాజీ ఎంపీ హర్షకుమార్, మాల మహానాడు నాయకులు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయిబాబా ఆలయ ఆవరణంలో జరిగిన సభలో మాజీ ఎంపీ హర్షకుమార్,రేంజర్ల రాజేష్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్ తదితరులు మాట్లాడుతూ మడకశిరలో దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎంతో మందికి దామోదరం సంజీవయ్య ఆదర్శప్రాయుడని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. స్థానిక మాల మహానాడు నాయకులు వారికి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు, మాజీ చైర్‌పర్సన్ రాధమ్మ, న్యాయవాది క్రిష్ణమూర్తి, సోమ్‌కుమార్, సోమన్న, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


