ముగిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

Feb 14 2026 10:07 AM | Updated on Feb 14 2026 10:07 AM

ముగిస

ముగిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

అనంతపురం: ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం సజావుగా ముగిశాయి. అనంతపురం జిల్లా కోర్టులో 883, కదిరిలో 101, పెనుకొండలో 65, హిందూపురంలో 100, కళ్యాణదుర్గంలో 49, రాయదుర్గంలో 50, ఉరవకొండలో 15, ధర్మవరంలో 83, పుట్టపర్తిలో 20, మడకశిరలో 28, తాడిపత్రిలో 73, గుత్తిలో 92, గుంతకల్లులో 108 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఆలూరి రామిరెడ్డి, బడా నారాయణరెడ్డి, రాంకుమార్‌, జక్కల శ్రీనివాసులు పోటీ చేశారు. అనంతపురం జిల్లా కోర్టులో తొలిసారిగా భారీ ఎత్తున ఓట్లు పోలవ్వడం విశేషం. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ బడుల్లో

విద్యార్థులను చేరుద్దాం

పుట్టపర్తి టౌన్‌: ‘ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేరుద్దాం.. ఊరి బడిని కాపాడుకుందాం’ అంటూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకుడు (ఆర్జేడీ) శామ్యూల్‌, డీఈఓ కిష్టప్ప శుక్రవారం ఆవిష్కరించారు. విద్యార్థుల నమోదు కోసం యూటీఎఫ్‌ ఇలాంటి కార్యక్రమాలు చేపట్డం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, కొత్తచెరువు మండల విద్యాధికారి జయచంద్ర, రాష్ట్ర నాయకులు దేవేంద్రమ్మ, రమణయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణనాయక్‌, నాయకులు పాల్గొన్నారు.

వ్యక్తి బలవన్మరణం

పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లికి చెందిన శ్రీరాములు(43) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద వాపోయేవాడు. గత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితులు గాలిస్తూనే ఉన్నారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా శ్రీరాములు ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే గ్రామ శివారులోని పొలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే మామిడి చెట్టుకు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న శ్రీరాములు మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి హనుమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

యువకుడి దుర్మరణం

రొద్దం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... రొద్దం మండలం పాతర్లపల్లికి చెందిన శ్రీనివాసులు(31) బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శివరాత్రి పండుగ కోసమని శుక్రవారం ద్విచక్ర వాహనంపై బెంగళూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి రొద్దం సమీపంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్దకు చేరుకోగానే కల్లుకుంట గ్రామం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆనంద్‌ ఢీకొన్నాడు. ఘటనలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆనంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘనంగా భోగ్‌ భండార్‌

గుత్తి రూరల్‌: సేవాలాల్‌ మహారాజ్‌ జయంత్యుత్సవాల సందర్భంగా గుత్తి మండలం సేవాఘడ్‌ ఆలయ ఆవరణలో శుక్రవారం భోగ్‌ భండార్‌ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శివకుమార్‌ నాయక్‌, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులునాయక్‌ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు హోమాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించారు కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు అశ్వత్థనాయక్‌, గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గర్మామల్లికార్జున నాయక్‌, నాయకులు బాలాజీనాయక్‌, కేశవనాయక్‌ పాల్గొన్నారు.

ముగిసిన  ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు 1
1/3

ముగిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ముగిసిన  ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు 2
2/3

ముగిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ముగిసిన  ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు 3
3/3

ముగిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement