పెళ్లికూతురా.. ఏం ప‌ట్టావ‌మ్మా! | Bride rasgulla catch steals the show video goes viral | Sakshi
Sakshi News home page

పిల్ల.. పట్టేసింది రసగుల్లా!

Jan 23 2026 7:32 PM | Updated on Jan 23 2026 7:49 PM

Bride rasgulla catch steals the show video goes viral

క్రికెట్‌ మైదానంలో ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేయడం చూశాం.. కానీ, పెళ్లి మండపంలో ఒక వధువు అంతకంటే వేగంగా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కూతురంటే సిగ్గుతో తలవంచుకుని కూర్చుంటుందనుకుంటే పొరపాటే.. ఈ వధువు వేగం చూస్తే నిష్ణాతులైన క్రికెటర్లు కూడా షాక్‌ అవ్వాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో.. పెళ్లి తంతులో భాగంగా వరుడి తల్లి.. తన కుమారుడికి ప్రేమతో రసగుల్లా తినిపించబోయింది. ఆ మిఠాయి నోటి దగ్గరకు వెళ్లేలోపే స్పూన్‌ పైనుంచి జారి కింద పడబోయింది.

వధువు మెరుపు క్యాచ్‌! 
ఆ రసగుల్లా నేలను తాకడానికి ముందే.. పక్కనే ఉన్న వధువు రెప్పపాటు కాలంలో స్పందించింది. తన చేతిని చాచి, గాలిలోనే ఆ రసగుల్లాను అద్భుతంగా క్యాచ్‌ పట్టింది. ఆ మిఠాయి కింద పడి వరుడి దుస్తులు పాడవకుండా, ఫంక్షన్‌ మధ్యలో ఇబ్బంది కలగకుండా తన ‘వికెట్‌ కీపింగ్‌’ నైపుణ్యంతో కాపాడేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 6 ల‌క్ష‌లుగాపై లైకులు, 4 వేల‌కు పైగా కామెంట్లు రావ‌డం విశేషం.

ధోనీ కూడా గర్వపడతాడు 
ఈ వీడియో వైరల్‌ (Video Viral) కావడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఈమె స్పందన చూస్తుంటే సాక్షాత్తూ ఎంఎస్‌ ధోనీ గుర్తొస్తున్నాడు’.. అని ఒకరు.. ‘ఫీల్డింగ్‌లో ఈమె ముందు సీజన్డ్‌ ప్లేయర్లు కూడా సరిపోరు’.. అని మరొకరు ప్రశంసించారు. ‘బహుశా ఆ రసగుల్లా అంటే వధువుకు చాలా ఇష్టమేమో.. అందుకే అంత ఫోకస్‌తో క్యాచ్‌ పట్టింది’.. అంటూ సరదాగా ఆట పట్టిస్తున్నారు. పెళ్లి వేడుకలో ఈ చిన్న పొరపాటు జరిగి ఉంటే కాసేపు గందరగోళం ఏర్పడేది. కానీ వధువు సమయస్ఫూర్తి ఆ క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా, ఒక ‘మ్యాచ్‌ విన్నింగ్‌’మూమెంట్‌గా మార్చేసింది.

చ‌ద‌వండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. ఆమె ఫుల్‌ హ్యాపీ!

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement