జయ కృష్ణ సినిమా.. నిర్మాత, దర్శకుడు ఎవరంటే.. | Jaya Krishna Ghattamaneni To Make His Debut Under Ashwini Dutt Directed By Ajay Bhupathi | Sakshi
Sakshi News home page

జయ కృష్ణ సినిమా.. నిర్మాత, దర్శకుడు ఎవరంటే..

Nov 9 2025 11:22 AM | Updated on Nov 9 2025 11:49 AM

Jaya Krishna Ghattamaneni To Make His Debut Under Ashwini Dutt  Directed By Ajay Bhupathi

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నటుడు చిత్రపరిశ్రమలోకి వస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని గ్రాండ్ లాంచ్‌ కానున్నారు. తన బాబాయి  మహేష్ బాబు ఆశీస్సులతో తొలి సినిమాకు సిద్ధం అవుతున్నాడు.  ఆర్‌ఎక్స్‌ 100, మంగళవరం చిత్రాలను తెరకెక్కించిన  దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌తో అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

గతంలో సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్‌బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు ఘట్టమనేని నుంచి మరో వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు.   అజయ్ భూపతితో కలిసి మూడవ తరం స్టార్‌ జయ కృష్ణ ఘట్టమనేనితో ఒక మంచి ప్రేమకథను అశ్విని దత్‌ నిర్మిస్తున్నారు.

జయ కృష్ణ  ఇప్పటికే నటనతో పాటు పైట్స్‌, డ్యాన్స్‌ వంటి ఇతర నైపుణ్యాలలో  శిక్షణ పొందాడు. ఈ ప్రాజెక్ట్‌ ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్ వంటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తెలుగు సినిమాలో  ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రేమకథను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. జయ కృష్ణ తండ్రి రమేశ్‌ బాబు అనారోగ్యం కారణంగా 2022లో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడి కెరీర్‌ను చూడాల్సిన బాధ్యత మహేష్‌ బాబు  మీద ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement