
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇక సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టికొట్టే సమయంలో భారత్ మాతా కీ జై అంటూ నినాదం చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఇదేమీ ఇండిపెండెన్స్ డే కాదంటూ జాన్వీని ట్రోల్ చేశారు.
తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌కు జాన్వీ కపూర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఉన్నవారంతా నాకంటే ముందు భారత్ మాతాకీ జై అని అన్నారని తెలిపింది. ఆ తర్వాత నేను కూడా చెప్పానని.. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్స్‌కు కౌంటరిచ్చింది.
నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీ కృష్ణా జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. ప్రతిరోజూ భారత్ మాతాకీ జై అని చెబుతా అని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో మరాఠీలో మాట్లాడిన జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుంది. ఢిల్లీ అబ్బాయితో ప్రేమలో పడిన మలయాళీ అమ్మాయి కథగా పరమ్ సుందరిని తెరకెక్కించారు.. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు.