ఫ్లాష్‌ బ్యాక్‌...అన్నయ్యతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌! | Bollywood Actress Minu Mumtaz Faced Backlash for Acting in Romantic Role with Her Brother Mehmood | Sakshi
Sakshi News home page

ఫ్లాష్‌ బ్యాక్‌...అన్నయ్యతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌!

Sep 11 2025 3:39 PM | Updated on Sep 11 2025 3:58 PM

Did you Know Minoo Mumtaz Sparked Controversy After She Romanced Her Real Life Brother

నటనే అయినప్పటికీ కూడా నిజ జీవితంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... తెరపై జంటగా కనిపించడాన్ని భారతీయ ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకోరు. అందుకే నటనను ఎంత ప్రొఫెషనల్‌గా తీసుకున్నప్పటికీ అలాంటి సాహసం మన దేశంలోని ఏ నటిగానీ ఏ నటుడుగానీ చేయరు. కానీ చాలా కాలం క్రితమే అలాంటి ధైర్యం చేసింది ఓ అందాల బాలీవుడ్‌ నటి. తన స్వంత అన్నయ్యతో రొమాంటిక్‌ జోడిగా నటించి, నర్తించి ఆ తర్వాత జనాగ్రహానికి గురైంది. ఆమె పేరు మిను ముంతాజ్‌.

భారతీయ సినిమాలో ప్రతిభావంతులైన నృత్యకారిణి, క్యారెక్టర్‌ నటిగా ప్రసిద్ధి చెందిన మిను ముంతాజ్, ముంబైలో జన్మించిన ఆమె తండ్రి ముంతాజ్‌ అలీ కూడా ప్రముఖ నటుడు  నృత్యకారుడు కూడా. ఆమె అతని నుంచి నృత్య కళను నేర్చుకోవడం దగ్గర నుంచి అతని అడుగుజాడల్లోనే నడిచింది, కాలక్రమంలో  ఆమె తండ్రి మద్యానికి బానిసగా మారాడు. దాంతో టీనేజ్‌లోనే మిను కుటుంబ ఆర్థిక భారాన్ని మోయవలసి వచ్చింది.

నటనపై ఇష్టం అనే కన్నా సంపాదన కోసమే మిను 1955లో  13 సంవత్సరాల వయసులో నానాభాయ్‌ భట్‌ చిత్రం హకీమ్‌ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తల్లికి ఇష్టం లేకున్నా,  సినిమా కెరీర్‌ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, మిను ముంతాజ్‌ తన కుటుంబాన్ని పోషించడానికి తప్పనిసరై నటనను కొనసాగించింది. 14 సంవత్సరాల వయస్సులోనే పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందింది.  హిందీ చిత్ర పరిశ్రమలో 1950లు  60లలో, ఆమె ప్రముఖ సెలబ్రిటీగా మారింది.  

అప్పటి చాలా మంది తారల్లాగే మిను ముంతాజ్‌ది కూడా ఒక పెద్ద కుటుంబం  ఆమెకు నలుగురు సోదరులు  నలుగురు సోదరీమణులు ఉండేవారు.  ఆమె అన్నయ్య మెహమూద్‌ సైతం అప్పటికే బాలీవుడ్‌లో స్థిరపడిన హాస్య నటుడు. అతను నటించిన  హౌరా బ్రిడ్జి సినిమా 1958 లో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ‘‘కోరా రంగ్‌ సునారియా కలి’’ అనే రొమాంటిక్‌  పాటలో మెహమూద్‌ సరసన మిను ముంతాజ్‌ ప్రియురాలిగా హొయలొలికిస్తూ నటించారు. సినిమా విడుదలైన తర్వాత, ఆ రొమాంటిక్‌ పాత్రలో నటించిన నటులు నిజ జీవితంలో తోబుట్టువులని తెలుసుకుని ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు.  

ఈ తారల నైతికత కుటుంబ సంబంధాల  సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు వీధుల్లో కి వెళ్లి మరీ నిరసన తెలిపారు. దీనికి స్పందించిన నటులు క్షమాపణ చెప్పడమే కాక మిను ముంతాజ్‌ తాను కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మాత్రమే ఆ పనిచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో కొంత కాలానికి ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఆ వివాదం ప్రభావమో మరొకటో గానీ మిను ముంతాజ్‌ స్వల్ప కాలంలోనే అవకాశాలు లేక పరిశ్రమకు దూరమై,  ఒక దర్శకుడిని వివాహం చేసుకుని ు కెనడాలో స్థిరపడింది, అక్కడ నివసిస్తూ 2003లో, మిను ముంతాజ్‌ ఆరోగ్యం క్షీణించడం  జ్ఞాపకశక్తి కోల్పోవడం ప్రారంభమైంది  వైద్య పరీక్షల్లో ఆమెకు 15 సంవత్సరాలుగా గుర్తించబడని మెదడు కణితి ఉందని తేలింది. అనారోగ్యంతో చాలా కాలం పోరాడిన  మిను ముంతాజ్‌ 2021లో మరణించారు,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement