బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న బ్యూటీ నోరా ఫతేహీ. పలు సూపర్ హిట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో అభిమానులను మెప్పించింది. తన గ్లామర్‌తో బాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్, తమిళ చిత్రం కాంచన 4లో కనిపించనుంది.
అయితే సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. ఇటీవల నోరాపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ టి సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌తో రిలేషన్‌పై ఉన్నారని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నోరా స్పందించింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. తనపై వచ్చిన వీడియోను చూసి వావ్ అంటూ స్మైలీ ఎమోజీని జోడించింది. దీంతో నోరా ఫతేహీ టాపిక్ బాలీవుడ్ చర్చనీయాంశంగా మారిపోయింది.
కాగా.. 2005లో నటి దివ్య ఖోస్లాను భూషణ్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో ఒక కొడుకు జన్మించారు. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై భూషణ్ కుమార్ మాత్రం స్పందించలేదు. నోరా ఫతేహి వ్యక్తిగత జీవితం గురించి కొత్త కొత్త ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతంలో మొరాకో ఫుట్‌బాల్ క్రీడాకారుడు అచ్రాఫ్ హకీమి రిలేషన్‌లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి.


