
సినీ తారల పెళ్లిళ్లు కాస్త లేట్గానే అవుతుంటాయి. వయసులో ఉన్నప్పుడు కెరీర్పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు రావనే భయంతో చాలా మంది హీరోయిన్లు వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమా చాన్స్లు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు హీరోయిన్కి పెళ్లి అయిందంటే.. ఇండస్ట్రీకి దూరం అయినట్లే. మళ్లీ తెరపై కనిపించేవాళ్లు కాదు. అందుకే పెళ్లి కాస్త లేట్గా చేసుకునేవాళ్లు. దీంతో పిల్లలను కూడా లేటు వయసులోనే కనేవాళ్లు. 42 ఏళ్ల వయసులో కత్రినా కైఫ్ ఇప్పుడు గర్భవతి అయింది. కత్రినా మాత్రమే కాదు.. చాలా మంది తారలు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అమ్మగా ప్రమోషన్ పొందారు. అలా తల్లైయిన తారలపై ఓ లుక్కేద్దాం.

కరీనా కపూర్
కరీనా కపూర్ 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.

బిపాషా బసు
బిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత 2022లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటికీ బిపాషా వయసు 43 ఏళ్లు.

ఐశ్వర్యరాయ్
38 ఏళ్ల వయసులో ఐశ్వరరాయ్ బచ్చన్ తల్లయింది. 2011లో ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు ఆరాధ్య. ఐశ్వర్య-అభిషేక్‌ల వివాహం 2007లో జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య అమ్మగా ప్రమోషన్ పొందింది.

రాణి ముఖర్జీ
2015లో రాణి ముఖర్జీ ఓ బిడ్డకు జన్మన్చింది. అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు. లేటు వయసులో తల్లయ్యారు. 47 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగాను ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.