 
													ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యూలతో పాటు సినీతారలు సైతం వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లోనూ పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. అలా బాలీవుడ్‌లోనూ ఓ సెలబ్రిటీ జంటకు సంబంధించిన పెళ్లి వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే వీరిద్దరి పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇద్దరు సీనియర్ నటులు కావడంతో బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ నటి మహిమా చౌదరి, నటుడు సంజయ్ మిశ్రా పెళ్లి దుస్తుల్లో మెరిశారు. ఈ వీడియోలో ఇద్దరు కూడా ఫోటోలకు కూడా పోజులివ్వడంతో నిజంగానే పెళ్లి చేసుకున్నారని నెటిజన్స్ షాకయ్యారు. వీరి పెళ్లి వీడియో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మహిమా చౌదరి, సంజయ్ మిశ్రా వివాహానికి సంబంధించి అసలు విషయం తెలియడంతో నెటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
బాలీవుడ్ నటి మహిమా చౌదరి, నటుడు సంజయ్ మిశ్రా ప్రస్తుతం 'దుర్లభ్ ప్రసాద్ కీ దుస్రీ షాదీ' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పెళ్లికి సంబంధించిన కథ కావడంతో సంజయ్ మిశ్రా వరుడి దుస్తులలో మహిమా చౌదరి ఫోటోతో వధువుగా కూర్చున్నట్లు కనిపించారు. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగానే ఇలా వధూవరుల్లా రెడీ అయ్యారు. అంతే తప్ప మహిమా చౌదరి, సంజయ్ మిశ్రా వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో వైరలైన విజువల్స్ 'దుర్లభ్ ప్రసాద్ కి దుస్రీ షాదీ' మూవీ కోసం ప్రమోషనల్ షూట్‌లో భాగంగానే చేశారు
రియల్ లైఫ్ విషయానికొస్తే.. మహిమా చౌదరి 2006లో ఆర్కిటెక్ట్ బాబీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాజ ఈ జంట విడిపోయారు, ప్రస్తుతం ఆమె తన కుమార్తె అరియానాను పెంచడంపై దృష్టి సారించింది. మరోవైపు సంజయ్ మిశ్రా.. కిరణ్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
