breaking news
Mahima Chaudhry
-
కూతురి బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్‌డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్‌డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్‌డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్‌తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్‌లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
-
‘ఆ సంఘటన నా కెరీర్‌ను నాశనం చేసింది’
బాలీవుడ్ నటి మహిమా చౌదరి తన జీవితంలో జరిగిన భయానక ప్రమాదం గురించి వెల్లడించారు. ఆ యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. బతకడం కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహిమా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నేను కాజోల్, అజయ్ దేవగణ్‌ల సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ‘దిల్ క్యా కరే’ చిత్రం కోసం పని చేస్తున్నాను. బెంగళూరులో షూటింగ్ జరుగుతుంది. స్టూడియోకు కార్లో వెళ్తుండగా నాకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఓ ట్రక్కు నా కారును ఢీకొట్టింది. గ్లాస్ మొత్తం నా ముఖం లోపలకు వెళ్లినట్లు అనిపించింది. నేను చనిపోతున్నానని అనుకున్నాను. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఎవరూ నాకు సహాయం చేయలేదు. నేను ఆసుపత్రికి చేరుకున్న చాలా సేపటి తరువాత నా తల్లి, అజయ్ వచ్చారు. నేను లేచి అద్దంలో నా ముఖం చూసుకుని భయపడ్డాను. డాక్టర్లు నాకు శస్త్రచికిత్స చేసి 67 గాజు ముక్కలను తీశారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ సంఘటన యొక్క జ్ఞాపకాలు మహిమా చౌదరిని ఉద్వేగానికి గురిచేశాయి. ‘ఆ ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు నాకు దుఖం వస్తుంది. ఆపరేషన్ తర్వాత నా ముఖం మీద కుట్లు ఉన్నాయి. నేను ఇంట్లోనే ఉండాలి.. సూర్యరశ్మి తగలకూడదు. నా గది పూర్తిగా చీకటిగా ఉంటుంది. అద్దం లేదు. యూవీ కిరణాల కాంతిని వెదజల్లే లైట్లు ఉండవు’ అని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం ఆమె కెరీర్‌ను పూర్తిగా దెబ్బ తీసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్ సమయంలో నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని నేను వదులు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జనాలు నాకు మద్దతుగా నిలవలేదు. వారు ‘ఆమె ముఖం నాశనం అయ్యింది.. ఆమెను తీసేసి మరొకరిని తీసుకుందాం’ అని భావించారు. దాంతో నేను ఆ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అన్నారు. -
షీనాబోరా తల్లి పాత్రలో బాలీవుడ్ నటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్య ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నారు. బెంగాలీ భాషలో తీస్తున్న 'డార్క్ చాకొలెట్' సినిమాలో షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా పాత్రలో బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మహిమ ఈ విషయం చెప్పింది. ఇంద్రాణిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర పోషించినట్టు తెలిపింది. 'షీనాబోరా హత్యను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇందులో షీనాబోరా తల్లి పాత్రలో నటించాను. నాకిదే తొలి బెంగాలీ చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు ఎంతో ఉత్సుకతగా ఉంది' అని మహిమ చెప్పింది. అగ్నిదేవ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా చౌదరితో పాటు రియా సేన్, ముంతాజ్ సార్కర్, రాజేశ్ శర్మ నటించారు. ఇంద్రాణి తన మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి కూతురు (మొదటి భర్త ద్వారా) షీనాబోరాను హత్య చేయించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా కొడుకు, షీనాబోరా ప్రేమించుకోవడం, ఇతర ఆర్థిక వ్యవహారాలు ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.