breaking news
Sanjay Mishra
-
Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు
మహా కుంభమేళా 2025 (Maha KumbhMela2025) ఉత్తర ప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ,విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల ఆచరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు రాజకీయ నాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు కూడా కుటుంబ సమేతంగా ప్రయాగరాజ్‌కు తరలి వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర రాజకీయ నాయకులు కూడా పవిత్ర స్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా నటి హేమా మాలిని, అనుపమ్ ఖేర్, భాగ్యశ్రీ, మిలింద్ సోమన్ వంటి నటులు, కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కోవలో ఇపుడు బాలీవుడ్ నటి నీనా గుప్తా (Neena Gupta) చేరారు.బాలీవుడ్ స్టార్స్ నీనా గుప్తా , సంజయ్ మిశ్రా మహా కుంభమేళాను సందర్శించి సంగంలో పవిత్ర స్నానం చేశారు. 2022 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న వారి ప్రాజెక్ట్ వాధ్ 2 కోసం ఇద్దరూ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఈ సందర్బంగా నీనా గుప్తా తన అనుభవాన్ని పంచుకున్నారు. తొలి సారి కుంభమేళాను సందర్శించాననీ, తనకు ఇంత తన జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందనీ, ఇది "విశిష్ట అనుభవం" అని అభివర్ణించారు."నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం... చివరకు, ఈ రోజు పుణ్య కుంభ స్నానం చేసాను" అని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం ఇంత బాగా నిర్వహించడం కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది.#WATCH | Prayagraj, UP | At #MahaKumbhMela2025, actor Neena Gupta says, "I have been wanting to come here for years... It was a unique experience... Finally, I took a dip today... The atmosphere here is crazy. I have never seen a bigger gathering in my life... I am impressed by… pic.twitter.com/kLHwVCbAL9— ANI (@ANI) February 7, 2025మరోవైపు చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం. సౌకర్యాలు అన్నీ చాలా బావున్నాయి అంటూ నటుడు సంజయ్ మిశ్రా ప్రశంసించారు. రద్దీ తక్కువగా ఉంటుంది అనుకున్నాను..కానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉందంటూ తన అనుభవాన్ని పంచు కున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే మహా కుంభమేళా అత్యంత ముఖ్యమైందిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ్2025 ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ విశిష్ట కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ముగియనున్న కారణంగా భక్తులసంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాకాగా ఇటీవల పంచావత్ సిరీస్‌తో నటిగాతానేంటో నిరూపించుకున్ననటి నీనా గుప్తా. తనదైన నటనతో అనేక సినిమాల్లో ఆకట్టుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ద్వారా కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఒంటరిగానే ఆమెను పెంచి పెద్దదాన్ని చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న మసాబా రెండో పెళ్లి చేసుకుని ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. -
కలెక్టర్‌వా? పోలిటికల్ ఏజెంట్‌వా?
భోపాల్: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని పక్కనపెట్టి.. ఓడిన అభ్యర్థిని విజేతగా ప్రకటించిన నేరానికి ఓ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ పోస్ట్‌కే అనర్హుడివంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించారు పన్నా జిల్లా కలెక్టర్ సంజయ్ మిశ్రా. దీంతో న్యాయమూర్తి ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పన్నా కలెక్టర్ సంజయ్ మిశ్రా-ఫైల్ ఫొటో పన్నా జిల్లాలో జులై 27వ తేదీన 25 మంది సభ్యులున్న గున్నూర్ జనపద్ పంచాయతీకి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి పరమానంద శర్మ బీజేపీ అభ్యర్థి రామ్‌శిరోమణి మిశ్రాను ఓడించారు. అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ పరమానంద శర్మను విజేతగా ప్రకటించగా.. రామ్‌శిరోమణి మాత్రం పన్నా కలెక్టర్ సంజయ్ మిశ్రాను ఆశ్రయించి వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. దీంతో ఆ మరుసటి రోజు లాటరీ ద్వారా ఎన్నికలు నిర్వహించి.. రామ్శిరోమణిని విజేతగా ప్రకటించారు కలెక్టర్ సంజయ్ మిశ్రా. దీంతో పరమానంద శర్మ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనను వినిపించేందుకు సమయం కూడా ఇవ్వలేదని పిటిషన్లో అభ్యర్థించారు. పిటిషన్‌పై విచారణ సందర్భగా.. జస్టిస్ వివేక్ అగర్వాల్, కలెక్టర్ సంజయ్ మిశ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక పొలిటికల్ ఏజెంట్‌గా వ్యవహారించారు. కలెక్టర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదు. కలెక్టర్ విధుల నుంచి ఆయన్ని తొలగించాలి అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
అక్టోబర్ 6 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సంజయ్ మిశ్రా (నటుడు), వినోద్ ఖన్నా (నటుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య. దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్న ఇన్స్టిట్యూషన్ల లో సీటు వస్తుంది. వ్యాపారుల సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. మీరు 6వ తేదీన పుట్టినందువల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలలో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. అయితే ఆపోజిట్ సెక్స్వారితో సంబంధాలు నెరిపే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్