అక్టోబర్ 6 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | October 6 to celebrate the birthday of buying Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 6 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 5 2015 11:06 PM | Updated on Sep 3 2017 10:29 AM

అక్టోబర్  6 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 6 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. పుట్టిన తేదీ 6.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
సంజయ్ మిశ్రా (నటుడు), వినోద్ ఖన్నా (నటుడు)

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య.   దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్న ఇన్‌స్టిట్యూషన్ల లో సీటు వస్తుంది. వ్యాపారుల సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. మీరు 6వ తేదీన పుట్టినందువల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది.

ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలలో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. అయితే ఆపోజిట్ సెక్స్‌వారితో సంబంధాలు నెరిపే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు.
 
సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement