
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్లో ఎప్పటికీ బిగ్‌బాస్‌లో పాల్గొనని చెప్పింది.
తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్బాస్ మేకర్స్లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్పై పడుకుంటారు. అదే ప్లేస్లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.