
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2023లో ప్రణవ్ బగ్గాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే నెలలో గర్భం ధరించిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా తమకు పాప పుట్టిందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. 2001లో బాలీవుడ్‌లో హిట్ అయిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది మాల్వికా రాజ్. అంతేకాకుండా రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడిన మాల్వికా రాజ్ కొన్ని నెలల డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలోని బీచ్‌లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలకు పలువురు సినీతారలు హాజరయ్యారు. తెలుగులో 'జయదేవ్' అనే చిత్రంలో కనిపించింది. ఇటీవలే క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ 'స్వైప్ క్రైమ్'లోనూ నటించింది.