
బాలీవుడ్‌లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటి మాల్వికా రాజ్. ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మే నెలలో అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
తాజాగా మాల్వికా రాజ్ సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తన భర్త ప్రణవ్ బగ్గాతో కలిసి ఆనందం వ్యక్తం చేసింది. తన సీమంతానికి విచ్చేసి మీ ప్రేమను పంచిన అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది హీరోయిన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది
కాగా.. 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న మాల్వికా రాజ్.. రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కించిన 'K3G' అనే చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను మాళవిక పోషించింది. అంతే కాకుండా ఆమె 2017లో వచ్చిన టాలీవుడ్ చిత్రం జయదేవ్‌లో కూడా కనిపించింది.
మాల్వికా రాజ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కుమార్తె. అంతేకాకుండా ప్రముఖ నటి అనితా రాజ్ మేనకోడలు కూడా. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. బీచ్‌లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు.