
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుంగూభాయి కతియావాడి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డ్‌ను సాధించిపెట్టింది. అలియా భట్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ఏకంగా పది విభాగాల్లో ఫిలిం ఫేర్ అవార్డులు సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆదిత్య నారాయణ్ గంగూభాయి కతియావాడి మూవీ గురించి మాట్లాడారు.
ఈ చిత్రానికి మొదట ఆలియా భట్‌ను తీసుకోవాలని అనుకోలేదని ఆదిత్య నారాయణ్ వెల్లడించారు. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆదిత్య నారాయణ్.. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గంగూబాయి కతియావాడి సినిమాను ఇటీవలే జాతీయ అవార్డ్ అందుకున్న రాణి ముఖర్జీతో తెరకెక్కించాలని అనుకున్నట్లు వెల్లడించారు.
ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనే ఆసక్తితోనే సంజయ్ వద్ద అసిస్టెంట్‌గా చేరానని తెలిపారు. అయితే మొదట్లో భన్సాలీ తనను సీరియస్‌గా తీసుకోలేదని.. విసుగొచ్చి మానేస్తాడని అనుకున్నాడని పేర్కొన్నారు. ఓ వారం తర్వాత నాకు పని చెప్పడం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ వద్ద రామ్-లీలా, గంగూబాయి కతియావాడి (2022) మూవీస్ స్క్రిప్ట్‌లు ఉన్నాయని తెలిపారు. అప్పుడే రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడిని నిర్మించాలని ఆలోచన ఉందని మాతో చెప్పాడని పేర్కొన్నారు.