
ఈ ఏడాది ఛావా, ఆజాద్ చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డయానా పెంటీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను ట్రీట్ చేసే విధానంపై స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలను సామర్థ్యం కంటే.. కేవలం బాహ్య రూపానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. కేవలం 30 ఏళ్ల వయసులేనే ఎంతోమంది పిల్లలకు తల్లిగా నటించే పాత్రలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డయానా మహిళా నటుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని ప్రశ్నించింది.
డయానా మాట్లాడుతూ.. 'ఉదాహరణకు ఒక వేదికపై మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు.. మీ అందం మీరు అద్భుతం ప్రశంసిస్తారు. ప్రజలు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ రూపాన్ని ప్రశంసించడం చాలా బాగుంది. కానీ ఒక మహిళగా అది అంతకు మించి ఉంటుందని ఆశిస్తారు. ఒక నటిగా కేవలం అందం మాత్రమే కాకుండా.. నైపుణ్యం, నటనతో ప్రసిద్ధి చెందగలమని ఆశిస్తాం. అది మాకు చాలా అవసరం కూడా. మహిళ నటులను కేవలం బ్యూటీఫుల్, అద్భుతం అని పిలవడం మంచిదే.. కానీ అది సరిపోదు. ఇది ఒక పోరాటం కాదు. కొంతకాలంగా ఒక ఈ పద్ధతిని అంగీకరించడం ప్రారంభించారు. నేను అలాంటి దానిలో భాగం కావాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. దీన్ని ఎదుర్కోవడానికి అదే ఉత్తమ మార్గం. ఇది నాకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది' అని పంచుకున్నారు.
కాగా.. డయానా ప్రస్తుతం 'డు యు వాన్నా పార్టనర్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో తమన్నా భాటియా, జావేద్ జాఫెరి, నకుల్ మెహతా, శ్వేతా తివారీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు కోలిన్ డి'కున్హా, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం డు యు వన్నా పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.