లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) లీడ్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం సాలీ మొహబ్బత్. ఈ మూవీలో మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాకు టిస్కా చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. గతేడాది రిలీజవుతుందని ప్రకటించిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేటర్లకు రాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. సాలీ మొహబ్బత్‌ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీని త్వరలోనే జీ5 వేదికగా మీ ముందుకు రానుందని ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్5 ప్రొడక్షన్ బ్యానర్‌లో జ్యోతి దేశ్‌పాండే, దినేశ్ మల్హోత్రా, మనీశ్ మల్హోత్రా నిర్మించారు.
Kabhi dard, toh kabhi sukoon deti hai..
Yeh Saali Mohabbat na jaane kya kya karwati hai!#SaaliMohabbat, coming soon on #ZEE5#SaaliMohabbatOnZEE5@radhika_apte @divyenndu @anuragkashyap72 @anshumaanpushk1 #SauraseniMaitra #SharatSaxena @tiscatime #JyotiDeshpande… pic.twitter.com/WCnR9Sc9vg— Jio Studios (@jiostudios) November 7, 2025


