
సినిమా రంగంలో సక్సెస్ అనేది చాలా తక్కువ. అయినా చాలా మంది ఈ రంగుల ప్రపంచంలోకి రావాలని ఆశపడతారు. ఇతర రంగాలలో బలంగా స్థిరపడినా సరే.. దాన్ని వదులుకొని మరీ ఇండస్ట్రీలోకి వస్తారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయి ‘స్టార్స్’ అవుతారు. అలాంటి వారిలో నటి సోహా అలీఖాన్ ఒకరు.

ఇంటర్నేషనల్ బ్యాంకులో జాబ్
ఆమె లెజెండరీ నటి షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కుమార్తె, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ సొదరి అయినప్పటికీ.. చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆమె అస్సలు అనుకోలేదు. పెరెంట్స్ కూడా ఆమెను ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న సోహా.. ఈ తర్వాత ముంబైకి వచ్చి ఓ ఇంటర్నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేసింది. అప్పుడు ఆమె జీతం నెలకు రూ. 18 వేలు మాత్రమే ఉండేది. ముంబైలో ఆమె నివసించే ఇంటి రెంట్‌కే రూ. 17000 పోయేవి అట. అయినా కూడా ఇండిపెండెంట్‌గా బతకాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగం చేసేదట.

తన తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అప్పట్లోనే 2700 కోట్ల ఆస్తి ఉండేదట. డబ్బుకు కొదవ లేకున్నా.. పెరెంట్స్‌ని అడగడం ఇష్టంలేక జాబ్ చేసి తన అవసరాలు తానే తీర్చుకునేదానిని అని ఓ ఇంటర్వ్యూలో సోహా అలీఖాన్ చెప్పింది.
అలా సినిమాల్లోకి..
బ్యాంకింగ్ జాబ్ చేస్తున్న సమయంలోనే సోహా మనసు సినిమా రంగంపై పడింది. సినిమా చాన్స్‌ల కోసం చేస్తున్న సమయంలో ఓ మోడలింగ్ కాంట్రాక్టు దక్కింది. ఆ తర్వాత ఆమె జీవితం మారిపోయింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా చాన్స్ వచ్చింది. షాహిద్ కపూర్‌కు జోడీగా ‘దిల్ మాంగే మోర్(2004)’లో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు ఆమె అందుకున్న రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు .
నిజానికి సోహా ఈ సినిమా కంటే ముందే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పహేలి’లో నటించాల్సింది. ఆ ఆఫర్ వచ్చిందనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు రాణి ముఖర్జీ చేతికి వెళ్లింది. దీంతో సోహా నిరుద్యోగిగా మారిపోయింది. అదే టైమ్‌లో షాహిద్ కపూర్‌తో ‘దిల్ మాంగే మోర్’ అవకాశం దక్కింది. ఆ సినిమా తర్వాత సోహకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి.
కొన్నాళ్లకే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె కెరీర్‌లో రంగ్ దే బసంతి, అహిస్టా అహిస్టా, ఖోయా ఖోయా చంద్, ముంబై మేరీ జాన్, 99, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్ లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే హీరోయిన్‌గా ఆమెకు అపజయాలే ఎక్కువ వచ్చాయి. యాక్టింగ్‌తో పాటు రైటర్‌గానే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె రాసిన బుక్, ‘ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్’ క్రాస్‌వర్డ్ బుక్ అవార్డును గెలుచుకుంది. సోహా అలీ ఖాన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2015లో నటుడు కునాల్ ఖేముని వివాహం చేసుకుంది. వారికి ఇనాయ అనే కుమార్తె ఉంది.