
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్‌గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చింది.
కదులుతున్న రైలు నుంచి దూకేశా
'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్‌గేట్‌కు వెళ్దామనుకున్నాను. స్టేషన్‌కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు.

సినిమా
ఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్‌లో నటించింది. రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్‌సిలా ప్యార్ కా వంటి సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది.
చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?