సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవారే ఉన్నారు. కొంతమందికి ఇండస్ట్రీ నుంచి ఎదురైతే..మరికొంతమందికి బయట నుంచే ఇలాంటి వేధింపులు వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండడం వల్లే ఇప్పుడు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ అయేషా ఖాన్(Ayesha Khan) కూడా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైయ్యారట. బాబాయ్ లాంటివాడే తనతో అసభ్యకరంగా మాట్లాడి హింసించాడట. ఇప్పటికే ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్ల వెంట నీళ్లు ఆగవని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయేషా.
ముంబైకి చెందిన ఈ బ్యూటీ..బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తుంది. కసాటి జిందగీ కే అనే సీరియల్లో ఆమె ఓ చిన్న పాత్ర పోషించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. హిందీ బిగ్బాస్ షో ఆమెను పాపులర్ చేసింది. సీజన్ 17లో పాల్గొన్న ఆమె..11 వారాల పాటు హౌస్లో ఉండి తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ సరసన నటించి, మెప్పించింది. ఓ భీమ్ బుష్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం బెంగాలీతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయేషా.. ఎప్పటికప్పడు తన సినిమా అప్డేట్స్తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని అలరిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
‘ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. చిన్న వయసులోనే లైగింక వేధింపులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఓసారి రోడ్డుపై ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే.. మా నాన్న స్నేహితుడు ఒకరు పిలిచారు. నేను ఆయనను బాబాయ్ అని పిలిచేదాన్ని. నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. బాబాయ్ లాంటివాడు అలా మాట్లాడేసరికి షాకయ్యారు. ఆ వెంటనే మళ్లీ నావైపుగా వచ్చి అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. అప్పుడు నా వయసు 9 ఏళ్లు మాత్రమే. ఆయన ఎందుకు అలా అన్నాడో, ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్లి ఏడ్చేశా. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్లల్లోనుంచి నీళ్లు వచ్చేస్తాయి’ అని ఆయేషా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


