బాలీవుడ్‌ పీఆర్‌ కల్చర్‌పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు | Taapsee Pannu Exposes Bollywood Toxic PR Game | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ పీఆర్‌ కల్చర్‌పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

Jan 14 2026 2:53 PM | Updated on Jan 14 2026 3:13 PM

Taapsee Pannu Exposes Bollywood Toxic PR Game

‘‘హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో బాలీవుడ్‌లో పీఆర్‌ (పబ్లిక్‌ రిలేషన్స్‌) వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పీఆర్‌ అంటే మన గురించి, మన సినిమాల గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రమోషన్‌ అనేది ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది. ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మన ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడుతున్నారు’’ అని హీరోయిన్‌ తాప్సీ(Taapsee Pannu) పేర్కొన్నారు. 

ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఆర్‌ వ్యవస్థ గురించి మాట్లాడారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా వర్క్‌లో స్పీడ్‌ తగ్గించాను. ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీలోని పీఆర్‌ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రతి దానికి డబ్బు చెల్లించాలని గ్రహించాను. ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడతారు. మీ విజయం వేరొకరి వైఫల్యంపై ఆధారపడి ఉంటుందనేలా కొత్త వెర్షన్స్‌ సృష్టించారు. 

కానీ, నా మనస్తత్వం పూర్తి భిన్నమైనది. మన పనే మన గురించి చెప్పాలనుకుంటాను. అందుకే ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయను. నా ప్రయాణాలు, నా కోసం, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ ఆర్టికల్స్‌ రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్‌ మీడియా ఖాతాలకు వేలల్లో చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని స్పష్టం చేశారామె. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాప్సీ. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement