
బాలీవుడ్ నటి, ప్రపంచసుందరి సుస్మితాన్ సేన్ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుస్మితా ఆర్య అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఆ తర్వాత తాలి అనే వెబ్ సిరీస్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ అయిన సుస్మితా సేన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం విఫలమైంది. చాలామందితో డేటింగ్ చేసిన ఆమె.. ఎవరినీ కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్‌లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. ఆ తర్వాత మోడల్ రోహ్మన్ షాతో ప్రేమలో పడింది. కానీ వీరిద్దరు ప్రేమ మూడేళ్లు కూడా నిలవలేదు. 2018లో మొదలైన వీరి పరిచయం మూడేళ్లకే బ్రేకప్ అయింది. అయినప్పటికీ వీరిద్దరు ఫ్రెండ్స్‌గానే కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేటికి మన పరిచయానికి ఏడేళ్లు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సుస్మితా సేన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. జీవితంలో అనే విషయాలను నీ వద్ద నేర్చుకున్నానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. నీతో పరిచయం తర్వాత నా జీవితం చాలా మారిపోయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు.
రోహ్మన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మన స్నేహానికి నేటికి 7 సంవత్సరాలు. కొన్ని కథలు వాటి శీర్షికలను మించిపోతాయి. కానీ వాటి అర్థం ఉండదు. నేను మీకు చెస్ నేర్పించాను. కానీ మీరు నన్ను కనికరం లేకుండా ఓడించారు. మీరు నాకు ఈత నేర్పించారు. నా లైఫ్‌లో బెస్ట్ హెయిర్ కట్స్ చేసినందుకు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను. మేము మా పాత్రలు, భయాలు, బలాలను కూడా మార్చుకున్నాం. నీ ప్రేమకు, నీ నిశ్శబ్ద స్నేహానికి కృతజ్ఞతలు సుస్మితా సేన్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుష్మితా సేన్‌తో ఉన్న ఫోటోలు ఇద్దరు ఒకే జాకెట్ ధరించి కనిపించారు.