
ప్రముఖ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ సబా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. సభా ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్-12లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. కానీ ఈ సీజన్ టైటిల్ను బుల్లితెర నటి దీపికా కక్కర్ గెలుచుకుంది.
'బిగ్ బాస్ 12' ఫేమ్ సబా ఖాన్ వ్యాపారవేత్త వసీంను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో రాఖీ సావంత్ మాజీ భాయ్ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ సందడి చేశారు కాగా.. ఆదిల్.. సబా ఖాన్ సోదరి సోమి ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా.. సబా ఖాన్ భర్త వసీం జోధ్‌పూర్‌కు చెందిన నవాబ్ కుటుంబానికి చెందినవాడు. ఈ పెళ్లికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.