
బాలీవుడ్ నటి ఇషితా దత్తా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.
ఈ ఏడాదిలో రెండో బిడ్డకు స్వాగతం పలికింది ముద్దుగుమ్మ. ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇషితా జూన్లో రెండో బిడ్డను తన జీవితంలో ఆహ్వానం పలికింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అయితే తాజాగా ఇషాతా దత్తా ఆస్పత్రిలో చేరింది. తన రెండు నెలల కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని ఇషితా తెలిపింది. ఇది నిజంగా కఠినమైన నెల... నేను నా నవజాత శిశువుతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో... ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అంటూ వివరించింది. మీలో చాలా మంది అనుకుంటున్నట్లు నా బరువు తగ్గడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని తెలిపింది.

కాగా.. ఇషిత దత్తా -వత్సల్ సేత్ 2017లో వివాహం చేసుకున్నారు. రిష్టన్ కా సౌదాగర్ - బాజిగర్ అనే టీవీ సీరియల్ సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 19, 2023న, వారిద్దరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. ఇషిత దత్తా చివరిసారిగా 2022లో విడుదలైన దృశ్యం- 2లో కనిపించింది.
ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది.