షూటింగ్‌ కోసం వెళ్తే.. ముద్దు పెట్టుకోవాలని ఉందన్నాడు: నటి | Jennifer Mistry Claims Asit Kumarr Modi Wanted To Kiss Her | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టుకోవాలని ఉంది.. గదిలోకి రమ్మన్నాడు: నిర్మాతపై నటి ఆరోపణలు

Jul 29 2025 5:39 PM | Updated on Jul 29 2025 6:08 PM

Jennifer Mistry Claims Asit Kumarr Modi Wanted To Kiss Her

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్కౌచ్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. స్టార్హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ఆరిస్టుల వరకు ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్కౌచ్ఎదుర్కొంటున్నారు. అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకూ గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చాలా మంది వేధింపులపై తిరగబడుతున్నారు. తమను వేధించిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా మీడియా ముఖంగా వారి బాగోతాలను బటయపెడుతున్నారు

తాజాగా మరో నటి, ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ఫేంజెన్నిఫర్ మిస్త్రీ(Jennifer Mistry ) కూడా నిర్మాతతో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. షూటింగ్కోసం విదేశాలకు వెళ్తే..గదిలోకి రమ్మని వేధించాడని, అంతేకాకుండా తన గురించి పచ్చిగా మాట్లాడని చెప్పింది.

తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్న జెన్నిఫర్ మిస్త్రీ. ఆ షో నిర్మాత అసిత్ కుమార్‌ మోదీ( Asit Kumarr Modi ) వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించిందట. 2018లో షో ఆపరేషన్స్హెడ్సోహైల్ రమణితో గొడవ జరిగింది. అతనిపై ఫిర్యాదు చేద్దామని నిర్మాత అసిత్కుమార్మోదీ దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడ ఆయన స్పదన చూసి షాకయ్యాను. నా ఫిర్యాదు పట్టించుకోకుండానువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్‌’ అన్నారు

అలాగే 2019లో షూటింగ్కోసం సింగపూర్వెళ్తే.. అసిత్నన్ను గదిలోకి రమ్మన్నాడు. తనతో గదిలోకి వచ్చి విస్కీ తాగాలని బలవంతం చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. దీంతో అతను మోనికా భడోరియా (బావ్రీ) దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడారు. మరుసటి రోజు మేమంతా కాఫీ తాగుతుంటే..అతను నా దగ్గరకు వచ్చి నీ పెదాలు చాలా సెక్సీగా ఉన్నాయి. నాకు ముద్దు పెట్టుకోవాలని ఉందిఅని అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అవి నాపై తీవ్ర ప్రభావం చూపాయిఅని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మిస్త్రీ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement