
బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం చేశారు. తమ సొంతింటిలో పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఏడాదిలోనే ఈ జంటకు కూతురు పుట్టింది. మార్చి నెలలో అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వీరి ముద్దుల కూతురికి ఈవారా విపుల రాహుల్ అని పేరు పెట్టారు.
(ఇది చదవండి: కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!)
కాగా.. 2019లో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని ఓ ఫామ్హౌస్లో గ్రాండ్గా జరిగింది. ఈ వివాహా వేడుకలో సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా.. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురని దాదాపు అందరికీ తెలిసిందే.