కేఎల్ రాహుల్‌ ముద్దుల కూతురు.. పేరు రివీల్‌ చేసిన అతియాశెట్టి! | KL Rahul Wife Athiya Shetty Reveals Her Daughter Name and meaning | Sakshi
Sakshi News home page

Athiya Shetty: అతియాశెట్టి ముద్దుల కూతురు పేరు రివీల్.. అర్థమేంటో తెలుసా?

Apr 18 2025 3:11 PM | Updated on Apr 18 2025 4:03 PM

KL Rahul Wife Athiya Shetty Reveals Her Daughter Name and meaning

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇటీవల పుట్టిన బిడ్డకు ఇప్పటి వరకు పేరు పెట్టలేదు. రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌తో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా అతియాశెట్టి- కేఎల్ రాహుల్‌ తమ ముద్దుల కూతురికి నామకరణం చేశారు. ఈవారా విపుల రాహుల్‌ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అతియాశెట్టి శెట్టి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు ఈ పేరుకు అర్థం కూడా చెప్పేసింది. ఈవారా అంటే దేవుని గిఫ్ట్ అని.. విపుల అంటే అమ్మమ్మ (అతియా శెట్టి వాళ్ల అమ్మమ్మ) (మనా శెట్టి తల్లి) పేరు వచ్చేలా ఆమెకు గౌరవంగా.. రాహుల్ అంటే పాపా(నాన్న) అని అర్థం వచ్చేలా పెట్టినట్లు వివరించింది.

kl

కాగా.. ఇటీవల అతియాశెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్‌లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement