
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ (Sonam Kapoor) గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఆ తర్వాత 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2022లో మొదటి బిడ్డకు వెల్‌కమ్ చెప్పింది. తన ముద్దుల కుమారుడికి వాయు అనే పేరు పెట్టుకుంది.
తాజాగా సోనమ్ కపూర్ రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం. సోనమ్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్ కపూర్ తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లాడింది.
(ఇది చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్)
ఇక సోనమ్ కపూర్ కెరీర్ విషయానికొస్తే..ఆమె చివరిసారిగా బ్లైండ్ (2023) చిత్రంలో కనిపించింది. ఈ మూవీని 2011లో అదే పేరుతో వచ్చిన కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పురబ్ కోహ్లీ, వినయ్ పాఠక్, లిల్లెట్ దుబే కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాను ప్రకటించలేదు.