
ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్తో పాటు క్రేజీ కంటెంట్తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ సిరీస్లు ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. స్పై జానర్లో వస్తోన్న సలాకార్ అనే ఓటీటీలో సందడి చేయనుంది.
దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్ కథగా ఈ వెబ్ సిరీస్ను ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేస్తూ.. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సలకార్ వెబ్ సిరీస్ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్లో మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు.