ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరగనుంది.
కాగా.. 'అనుపమ' సీరియల్‌లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్‌ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో జనవరి 25న ఫామ్‌హౌస్‌లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.
అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది. ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది.


