
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయింది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా (Aneet Padda). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా (Saiyaara Movie). అహాన్ పాండే (అనన్య పాండే కజిన్) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
వీడియో వైరల్
ఇదిలా ఉంటే తాజాగా అనీత్ పడ్డా ముంబైలోని ఓ సెలూన్‌కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్ ధరించిన అనీత్.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్‌గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనీత్ పడ్డా.. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది.
చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న హీరోయిన్