breaking news
Aneet Padda
-
రూ.200 కోట్ల క్లబ్లో ‘సైయారా’.. ఖాన్స్ రికార్డ్స్ బద్దలు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్‌లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టడం లేదు.(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్‌ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్‌గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ. -
తొలి సినిమాకే సెన్సేషన్.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
తొలి సినిమాకే రూ.150 కోట్ల కలెక్షన్స్.. అయినా సింపుల్‌గా..
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయింది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా (Aneet Padda). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా (Saiyaara Movie). అహాన్ పాండే (అనన్య పాండే కజిన్) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వీడియో వైరల్ఇదిలా ఉంటే తాజాగా అనీత్ పడ్డా ముంబైలోని ఓ సెలూన్‌కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్ ధరించిన అనీత్.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్‌గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనీత్ పడ్డా.. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala)చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న హీరోయిన్