బాలీవుడ్‌లో ఈ ఏడాది సంచలనం సృష్టించిన మూవీ సయారా (Saiyaara Movie). చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లైగర్ బ్యూటీ అనన్య పాండే కజిన్ అహాన్ పాండే (Ahaan Panday) కథానాయకుడిగా పరిచయం అవగా, బాలీవుడ్ నటి అనీత్ పడ్డా (Aneet Padda) హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
తను నా బెస్ట్‌ఫ్రెండ్
ఆన్‌స్క్రీన్‌పై జంటగా కనిపించిన వీరు రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై అహాన్ పాండే స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అనీత్ నా బెస్ట్‌ఫ్రెండ్. సోషల్ మీడియాలో అనుకున్నట్లుగా మేము ప్రేమికులమైతే కాదు. మా మధ్య కెమిస్ట్రీ ఉంది. కానీ అది మీరనుకునే కెమిస్ట్రీ కాదు. కెమిస్ట్రీ అంటే రొమాంటిక్ అని అర్థం కాదు. కంఫర్ట్, భద్రత, ఒకరినొకరు చూసుకోవడం.
ఇప్పుడైతే సింగిల్
మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తనతో ఉన్నట్లుగా నేనెవరితోనూ లేను. అలా అని తను నా ప్రేయసి మాత్రం కాదు. ప్రస్తుతానికి నేను సింగిల్ అని చెప్పుకొచ్చాడు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయారా మూవీ జూలై 18న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.570 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
చదవండి: పక్కా ప్లాన్‌తో స్క్రిప్ట్ రాస్తున్నా: కీర్తి సురేశ్


