వంశీ, తేజస్విని, కిరణ్, అఖిల్, సాయిలు
‘‘రాజు వెడ్స్ రాంబాయి’ క్లైమాక్స్ విని, షాక్ అయ్యాను. ఇలాంటి దారుణం కూడా జరిగిందా? ఇలా చేస్తారా? ఇలాంటి మనుషులు ఉంటారా? అనిపించింది. ఈ సినిమాను మిగతా వారికంటే ముందు పదిహేనేళ్లు ప్రేమకథను దాచిపెట్టిన ఆ ఊరివాళ్లు చూడాలి’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’.
సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరయ్యారు కిరణ్ అబ్బవరం. ‘‘ఒక ఊరు నేపథ్యంలో ఈ సినిమాను రూ పొందించాం’’ అన్నారు రాహుల్ మోపిదేవి.
వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మా సినిమా టిక్కట్ ధర కేవలం రూ.99 మాత్రమే ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘ఉప్పెన’లో అమ్మాయి తండ్రి ఎలా ఉంటాడో చూసి ఉంటారు. ‘కోర్టు’ చిత్రంలో మంగపతిని చూశారు. ఆపాత్రలకు మించి ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన హీరోయిన్ తండ్రి వెంకన్నపాత్ర ఉంటుంది’’ అన్నారు చైతన్య జొన్నలగడ్డ.


