బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది సైయారా.
కొత్త హీరోహీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
లైగర్ హీరోయిన్ అనన్య పాండే కజిన్ అహాన్ పాండే ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవగా, అనీత్ పడ్డా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ వసూళ్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కూడా లేదు.
కాగా అనీత్ పడ్డా గతంలో బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది.
అయితే హీరోయిన్‌గా మాత్రం సైయారా తన తొలి చిత్రం.
ఈ సినిమాతో అనీత్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ లభించింది.


