
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనీత్ పద్దా, అహాన్ పాండే జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి వీరిద్దరిపైనే పడింది. దీంతో ఆన్ స్క్రీన్ జోడీ.. ఆఫ్ స్క్రీన్ లైఫ్‌లో జత కట్టనున్నారా? అనే చర్చ మొదలైంది.
సైయారాలో అనీత్ పద్దా, అహాన్ పాండే కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. దీంతో నిజ జీవితంలోనూ డేటింగ్‌లో ఉన్నారని టాక్ తెగ వైరలవుతోంది. ఈ ఆన్ స్క్రీన్ జంట ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి తన రిలేషన్ గోప్యంగా ఉంచారని టాక్ నడుస్తోంది. ఒక్క సినిమాకే వీరిపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు.
ఓ నివేదిక ప్రకారం నిర్మాత ఆదిత్య చోప్రాకు దగ్గరి వ్యక్తి ఒకరు 'సైయారా' సినిమా షూటింగ్ సమయంలో అనీత్, అహాన్ ప్రేమలో పడ్డారని చెప్పారట. ఈ మూవీ కూడా ప్రేమకథ కావడంతో.. 'సైయారా' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది సహజంగానే జరిగిందని అన్నారట. షూట్‌లో మొదలైన స్నేహం.. ప్రేమగా మారిందని చెప్పాడట. ప్రస్తుతం ఈ జంట సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ.. ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. నిజంగానే ఆన్-స్క్రీన్ జోడీ ఆఫ్-స్క్రీన్ జంట కానుందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
కాగా.. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన 'సైయారా' జూలై 18న విడుదలైంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది.